Thursday, May 2, 2024
- Advertisement -

టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీడేర్ డేవిల్స్ జ‌ట్టు…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఏకంగా ఎనిమిదింట్లో గెలుపొంది ప్లేఆఫ్‌ బెర్తుని దాదాపు ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలవాలని సన్‌రైజర్స్ జట్టు ఉవ్విళ్లూరుతుండగా.. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలుపొందిన ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. సన్‌రైజర్స్ ప్రధాన బలం బౌలింగ్ అయితే.. ఢిల్లీ బలం బ్యాటింగ్ కావడంతో.. మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.హైదరాబాద్‌లో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడ్డ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా స్థానంలో శ్రీవత్స్‌ గోస్వామిని తీసుకున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -