Saturday, May 11, 2024
- Advertisement -

క్రికెట‌ర్ ష‌మీపై కేసు న‌మోదు…

- Advertisement -

తన భర్త మహ్మద్‌ షమీకి వివాహేతర సంబంధాలున్నాయంటూ భార్య హసీన్‌ జహాన్‌ ఇటీవల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. షమీకి వివాహేతర సంబంధాలున్నాయని, పెళ్లైనప్పటి నుంచి అత్తింటివారు గృహహింసకు పాల్పడుతున్నారని జహాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు.

2014లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్‌ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు’ అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -