Sunday, May 5, 2024
- Advertisement -

ఆలోచన, అనుభవం….. జగన్ ముందు మరోసారి తేలిపోయిన చంద్రబాబు

- Advertisement -

2014 ఎన్నికల్లో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించడానికి ఉయోగపడిన ఒక ప్రధాన కారణం చంద్రబాబు అనుభవజ్ఙుడు అని చేసిన ప్రచారం. చంద్రబాబు కూడా ప్రతి సందర్భంలోనూ ఈ విషయంలో జగన్‌ని ఎద్దేవా చేశాడు. మరి నిజంగానే అనుభవం విషయంలో చంద్రబాబు-జగన్‌ల మధ్య అంత వ్యత్యాసం ఉందా?

2014ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ హామీలతో ఊదరగొట్టాడు. అప్పటికి రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంతో స్పష్టత వచ్చింది. అయినప్పటికీ అధికారంలోకి రావాలన్న స్వార్థంతో రుణమాఫీ హామీలు గుప్పించాడు చంద్రబాబు. కానీ జగన్ మాత్రం రుణమాఫీ సాధ్యం కాదని లెక్కలతో తేల్చి చెప్పాడు. ఇక బాబు భజన సేనాని పవన్ కళ్యాణ్, భజన మీడియా కూడా చంద్రబాబు రుణమాఫీ హామీలు అమలు చేస్తాడని చెప్పి ప్రజలను నమ్మించారు. చంద్రబాబు, లోకేష్‌లు కూడా జగన్ అక్రమాస్తులు స్వాధీనం చేసుకుని రుణాలు మాఫీ చేస్తామన్నారు.

నాలుగేళ్ళుగా ఏం చేశారు? రైతు రుణమాఫీ హామీపై మొదటి సంతకం అని చెప్పి రుణమాఫీ అమలు కమిటీపై అని చెప్పి మొదటి సంతకంతోనే దారుణంగా వంచించాడు. జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటానన్న చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా జగన్ దగ్గర అక్రమాస్తి ఉన్నట్టు చట్టప్రకారం తేల్చగలిగాడా?

ఇక జైట్లీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిన మరుక్షణమే మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు……. ప్యాకేజ్ అదుర్స్……. అదిరింది…… కేక……ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో పోతుంది అని రెచ్చిపోయి మాట్లాడేశాడు. ఇకపై ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని కూడా హుకుం జారీ చేశాడు. కానీ ఆ మరుసటి రోజే మీడియా ముందుకు వచ్చిన జగన్ మాత్రం ప్యాకేజ్‌లో ఏమీ లేదు. ఈ ప్యాకేజ్‌ని నమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్‌కి చిప్పే గతి. చంద్రబాబూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావ్’ అని సూటిగా ప్రశ్నించాడు. గంటలపాటు మీడియా మీట్‌లో కూర్చుని ప్యాకేజ్ వేస్ట్ అని చెప్పి లెక్కలతో సహా తేల్చేశాడు జగన్. కానీ చంద్రబాబు మాత్రం ఆరోజు జగన్ మాటలను ఎద్దేవా చేశాడు. నా అనుభవం అంత వయసులేని జగన్ కూడా నాకు చెప్పడమా? అంటూ ప్రతిపక్ష నాయకుడిని అవమానిస్తూ మాట్లాడేశాడు.

ఇప్పుడు అదే చంద్రబాబు……..నాలుగేళ్ళుగా తన మాయ మాటలు, తెలివితేటలు లేని, అవగాహన లేని వ్యవహారాలతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోవడానికి కారణమైన చంద్రబాబు……ఆ రోజు ప్యాకేజ్ వేస్ట్ అని జగన్ చెప్పిన మాటలనే వల్లెవేస్తున్నాడు. ప్యాకేజ్ ప్రకటించిన మరుసటి రోజు జగన్ చెప్పిన మాటలన్నింటినీ చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నాడు.

అనుభవం అనుభవం అని చెప్పుకుని……పవన్‌లాంటి వాళ్ళతో…..తన భజన మీడియాతో ప్రచారం చేయించుకుని ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మాయ చేయగలిగిన చంద్రబాబు అనుభవం ఇది. నాలుగేళ్ళలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఏనాడైనా అక్కరకు వచ్చిందా? కనీసం ప్రతిపక్ష నాయకుడు జగన్ చెప్పిన మాటలను ఆలకించాలన్న మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదు. తాను అనుకున్నట్టుగా……తన స్వార్థం కోసం అన్నీ చేసుకుంటూ పోయాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా రోడ్డుమీద నిలబెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ రోడ్డుపైన ఉందని మళ్ళీ ఆయనే మొసలి కన్నీరు కారుస్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -