Sunday, May 5, 2024
- Advertisement -

ధోనీకీ స్టార్ బ్యాట్స్ మేన్ బ్రేవో మ‌ద్ద‌తు…

- Advertisement -

ఈ మ‌ధ్య‌న భార‌త్ మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఫామ్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ కీపింగ్‌నుంచి త‌ప్పుకోవాల‌ని యువ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించిన ధోనీ.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో, వెస్టిండీస్‌‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో పేలవంగా విఫలమయ్యాడు.

దీంతో ఆస్ట్రేలియాతో టీ20లకి అతడ్ని పక్కన పెట్టిన సెలక్టర్లు.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేశారు. దీంతో.. ధోనీ టీ20 కెరీర్ ఇక ముగిసిపోయిందని మాజీ క్రికెటర్లు కొంత మంది అభిప్రాయపడ్డారు. అయితే ధోనీకీ ఎవ‌రూ ఊహించ‌ని వ్య‌క్తినుంచి మ‌ద్ద‌తు ల‌భించింది.

ధోనీ టీ20 కెరీర్‌పై వస్తున్న అభిప్రాయాలపై తాజాగా డ్వేన్ బ్రావో స్పందించాడు. ‘మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్ కెరీర్.. స్వయంగా అతను నిర్ణయించుకుంటే తప్ప ముగియదు. విమర్శకులు ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఆటగాళ్ల స్థాయిని బట్టి.. దాని ప్రభావం ఉంటుంది. కానీ.. ధోనీ ఇప్పటికే తన సత్తా ఏంటో..? నిరూపించుకున్న ఆటగాడు అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ ధోని. కాబట్టి.. రిటైర్మెంట్‌పై అతనే ఓ నిర్ణయం తీసుకుంటాడు. అంతేతప్ప.. ఎవరూ అతని టీ20 కెరీర్‌ని డిసైడ్ చేయలేరు’ అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -