Thursday, May 16, 2024
- Advertisement -

చిరంజీవి రేంజ్‌తో పోలిస్తే ప్ర‌భాస్ రేంజ్ ఎక్క‌డ‌..?

- Advertisement -

వ‌చ్చే వేస‌వి కాలంలో టాలీవుడ్‌లో పెద్ద యుద్ద‌మే జ‌ర‌గ‌నుందని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి,ప్ర‌భాస్‌లు న‌టించిన సినిమాలు వ‌చ్చే ఏప్రిల్‌లో విడుద‌ల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా.. రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాలు 2019 ఏప్రిల్‌లో విడుద‌ల అవుతున్నాయని గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. స్వాంతత్రోద్య‌కారుడైన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత క‌థ‌లో చిరంజీవి న‌టిస్తుండ‌గా,ప్రభాస్ మాత్రం హాలీవుడ్ రేంజ్ క‌థ‌తో తెలుగు తెర మీద దాడి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుద‌ల అవుతున్నాయని తెలుస్తుంది.రెండు సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలు కావ‌డంతో అంచనాలు విప‌రీతంగా ఉన్నాయి.ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల అయితే అది రెండు సినిమాల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని భావిస్తున్నారు.రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల అవ్వ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్లు షేర్ చేసుకోవాల్సి వ‌స్తుంది.దీని వ‌ల్ల నిర్మాత‌ల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఇక ప్ర‌స్తుతం ఉన్న మార్కెట్ ప్ర‌కారం చూస్తే ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు ప్ర‌భాస్‌.ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి సినిమాతో ఇండియాలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించారు.

బాహుబ‌లి సినిమా ఓవ‌ర్ఆల్‌గా 2000 కోట్లు సాధించి తెలుగు సినిమా స్టామినాను అంద‌రికి రుచి చూపించింది.ఇక ప‌ది సంవత్స‌రాలు త‌రువాత‌ చిరంజీవి న‌టించిన ఖైదీ 150 సినిమా 150 కోట్లు సాధించింది.ప్ర‌భాస్‌తో పోలిస్తే చిరంజీవి ఎక్క‌డో ఉన్నారు.మ‌రి వీరిద్ద‌రు న‌టించిన సినిమాలు ఒకే రోజు విడుద‌లైతే చిరంజీవేకే ఎక్కువ న‌ష్టం అంటున్నారు సినీ అభిమానులు.ఇదే క‌నుక నిజం అయితే చిరంజీవి మీద గౌర‌వం మీద ప్ర‌భాస్ త‌న సినిమాను వాయిదా వేసుకోవ‌డం ఖాయం అంటున్నారు చిరంజీవి అభిమానులు.ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావ‌లంటే మ‌రి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -