Tuesday, May 7, 2024
- Advertisement -

దుమ్మురేపిన పాకిస్థాన్‌…ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌

- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా జ‌రుగుతున్న ఇంగ్లండ్‌తో పాక్ దుమ్ము రేపింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. వెస్టీంగీస్ చేతితో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న పాక్ ఈ మ్యాచ్‌లో అద్భుత ఆట‌తీరును క‌న‌బ‌రిచింది. పాక్ బ్యాట్స్ మేన్‌లంద‌రూ బాగా ఆడ‌టంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది.

తొలిమ్యాచ్ లో విండీస్ పై ఘోరంగా విఫలమైన పాకిస్థాన్ టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఈసారి కలసికట్టుగా కదం తొక్కారు. సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ 84 పరుగులు చేయగా, యువ బాబర్ అజామ్ 63 పరుగులు సాధించాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 55, ఓపెనర్లు ఇమాముల్ హక్ 44, ఫఖార్ జమాన్ 36 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మొయిన్ అలీలకు చెరో 3 వికెట్లు దక్కగా, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -