Tuesday, May 21, 2024
- Advertisement -

కూలిన ఐఏఎఫ్ విమానం శ‌క‌లాలు గుర్తింపు …13 మంది మృతి

- Advertisement -

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్ -32 విమానం మ‌ధ్యాహ్నం గల్లంతు అయిన సంగ‌తి తెలిసిందే.అస్సాంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ఏఎన్ -32 విమానం కనిపించకుండా పోయింది. టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే విమానం రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. అస్సాం జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో విమానం ల్యాండింగ్ కావాల్సివుంది. 8 మంది క్రూ సిబ్బంది సహా ఆర్మీకి సంబంధించిన 5 మంది ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. విష‌యం తెలిసిన వెంట‌ను విమానాన్ని గుర్తించేందుకు సుఖోయ్‌ విమానాన్ని రంగంలోకి దింపింది. సాయంత్రానికి ఏఎన్‌-32 విమాన శకలాలను గుర్తించారు. ఇందులో ఉన్న 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -