Tuesday, April 30, 2024
- Advertisement -

ఇంగ్లండ్ కు డబుల్ బిగ్ షాక్…గాయాల కారణంగా ఇద్దరు బౌలర్లు ఔట్..

- Advertisement -

ఇంగ్లండ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో యాసిస్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే మొదటి టెస్ట్ పూర్తి కాకుండానె పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు పాస్ట్ బౌలర్లు గాయాల కారనంగా సీరీస్ మొత్తానికి దూరం అయ్యారు. గురువారం ఎడ్‌బస్టన్‌ వేదికగా ఆరంభమైన తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రధాన పేస్‌ ఆయుధం జేమ్స్‌ అండర్సన్‌ అర్థాంతరంగా వైదొలిగాడు. కేవలం నాలుగు ఓవర్లపాటు బౌలింగ్‌ మాత్రమే వేసిన అండర్సన్‌ కాలిపిక్క గాయంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు.

తొలి టెస్టులో భాగంగా లంచ్‌కు వెళ్లిన సమయంలో అండర్సన్‌కు స్కానింగ్‌ నిర్వహించగా అతను కొన్ని వారాల పాటు విశ్రాంతి కావాలిని డాక్టర్లు సూచించారు. దీంతో సీరీస్ మొత్తానికి దూరం కానున్నారు. మొదటి టెస్టు మ్యాచ్‌లో అండర్సన్‌ గాయం తిరగబెట్టడంతో చేసేదేలేక సీరీస్ నుంచి తప్పుకున్నారు.

ఇదలా ఉంటె తాజాగా ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ పక్కటెముకల గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ మార్క్‌వుడ్‌.‌ వరల్డ్‌కప్‌లోనే న్యూజిలాండ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో పక్కటెముకల బాధతోనే బౌలింగ్‌ చేశాడు. గాయం మళ్లీ తిరగబెట్టడంతో మార్క్‌వుడ్‌ యాషెస్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -