Tuesday, May 21, 2024
- Advertisement -

క్రికెట‌ర్ ష‌మీ భార్య‌కు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్‌…అకౌంట్ బ్లాక్‌

- Advertisement -

తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి భార్య హసీన్‌ జహాన్‌కు సోషియ‌ల్ దిగ్గ‌జం ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. సోషియ‌ల్ మీడియాలో ష‌మీ అక్ర‌మ సంబంధాల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే.

తన భర్త వల్ల, ఆయన కుటుంబం వల్ల తనకు ఎంతో అన్యాయం జరిగిందని… తనకు ఎవరి నుంచి సహాయసహకారాలు అందలేదని… అందుకే, తన సమస్యలను చెప్పుకోవడానికి ఫేస్ బుక్ ను ఆశ్రయించానని ఆమె తెలిపారు. అయితే, తన అనుమతి లేకుండానే తన అకౌంట్ ను ఎలా బ్లాక్ చేస్తారని, తాను పెట్టిన ఫొటోలను ఎలా డిలీట్ చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, హసీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం, గృహ హింస కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు. అతని సోదరుడిపై కూడా అత్యాచారయత్నం కేసు నమోదైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -