Monday, April 29, 2024
- Advertisement -

ఓటర్లను వాడుకుని వదిలేసిన పవన్‌కి మోడీ, బాబులను అనే అర్హత ఉందా?

- Advertisement -

చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ కూడా ఒకే తరహా రాజకీయాలకు తెరలేపారు. నాలుగేళ్ళలో ప్రజలకు చేసింది ఏమీ లేకపోవడంతో 2019 ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత రావడం ఖాయం అన్న అంచనాల నేపథ్యంలో ఇద్దరూ కూడా సానుభూతి రాజకీయాలకు తెరలేపారు. మోడీ చేతిలో నేను బాధితుడిని అని చెప్పుకోవడానికి చంద్రబాబు నానా తంటాలూ పడుతున్నాడు. ఇక పవన్ కూడా సేం టు సేం. వాడుకుని వదిలేశారు అని సానుభూతి డైలాగులు పలుకుతున్నాడు. అసలు విషయం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు, పవన్‌లు నష్టపోయింది ఏమీలేదు. చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ నాలుగేళ్ళుగా ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో కాగ్‌తో సహా ప్రభుత్వ సంస్థలే తేల్చిచెప్పాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నంబర్ ఒన్‌గా నిలిచింది. ఇక దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా భారీగా లాభపడ్డాడు. తెరవెనుక ప్యాకేజీలతో పాటు తన సినిమాలకు పర్మిషన్లు, తనతో ‘సంబంధం’ ఉన్న హీరోయిన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ పదవులు….అబ్బో రాజకీయాల్లో ఏ స్థాయిలో లాభాలు పొందొచ్చో అన్నీ లాభపడ్డాడు పవన్. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు కూడా మేం బాధితులం అని మొసలి కన్నీళ్ళు కార్చడం విశ్లేషకులకు కామెడీగా అనిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే చంద్రబాబు….బాబు కోసం వచ్చిన భజన సేనుడు పవన్, బాబును అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని దారుణాలకు పాల్పడాలో ఆ స్థాయికి దిగజారిన పచ్చ మీడియా సంస్థలు అన్నీ కలిసి విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని ఈ నాలుగేళ్ళలో పూర్తిగా అథోగతికి తీసుకెళ్ళాయి. విభజనలో సమాన భాగం పంచుకున్న బిజెపికి 2014ఎన్నికల్లో ఓట్లు వేయించిన ఘనత బాబు, పవన్ అండ్ బ్యాచ్‌ది. అలాగే ప్రత్యేక హోదా హామీ పేరు చెప్పుకుని వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లు 2014ఎన్నికల్లో ఏ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టారో చెప్పనవసరం లేదు. చంద్రబాబు, మోడీల అన్ని పాపాలకు బాధ్యుడైన పవన్…….2014లో బాబు, మోడీ అధికారంలోకి వచ్చినతర్వాత నుంచీ ఇప్పటి వరకూ కూడా పూర్తిగా తన సినిమా వ్యవహారాలపైనే కాన్సన్‌ట్రేట్ చేసిన పవన్ ఇప్పుడు ప్రజల కోసం ఏదో చేశాను అన్నట్టు మాట్లాడడం విస్తు గొలుపుతోంది. తన కెరీర్‌లోనే ఎన్నడూ చేయనంత వేగంగా 2014తర్వాత నుంచీ సినిమాలు చేశాడు పవన్. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ రేంజ్ హీరోలు అందరికంటే పవనే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇక చంద్రబాబు భజన చేస్తూ పొందని తెరవెనుక ప్రయోజనాలకు అంతేలేదు. అలాంటి పవన్ నష్టపోయింది ఎక్కడ? మోసపోయింది ఏముంది? కానీ మోసం చేసింది మాత్రం ఉంది. మోడీ, చంద్రబాబులకు ఓటేయండి. అధికారంలోకి వచ్చాక వాళ్ళు అన్యాయం చేస్తే నేను ప్రశ్నిస్తా…నిలదీస్తా…న్యాయం చేస్తా అని పంచ్ డైలాగులు పేల్చిన పవన్…….పవన్ మాటలను నమ్మి ఓట్లేసిన సీమాంధ్రప్రజలను మాత్రం పూర్తిగా ముంచాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను బాధితుడిని అన్నట్టు మాట్లాడడం….బాబు భజన మీడియా సంస్థలు అన్నీ కూడా తాటికాయంత అక్షరాలతో పవన్‌కి సానుభూతి వచ్చేలా చేయడానికి పాట్లు పడడం చూస్తుంటే ఆలోచన ఉన్న ఎవడికైనా కంపరం కలుగుతుందనడంలో సందేహం లేదు. నాలుగేళ్ళుగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయిన….కనీసం బాధ్యత కూడా తీసుకోకుండా సీమాంధ్ర ప్రజల బ్రతుకులు రోడ్డున పడడానికి కారణమైన బాబు, పవన్‌ల సానుభూతి డ్రామాలను సీమాంధ్రప్రజలు నమ్ముతారా? 2019లో మరోసారి ఓట్లేస్తారా? ఒకవేళ 2019లో గెలిస్తే మాత్రం…ఆ తర్వాత కూడా ఇలాంటి డ్రామాలతోనే 2024వరకూ టైం పాస్ చేయరన్న గ్యారెంటీ ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -