Monday, May 13, 2024
- Advertisement -

ట్విట్ట‌ర్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌కు ఛాలెంజ్ విసిరిన విరాట్ కోహ్లీ

- Advertisement -

టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు జాలీగా గ‌డుపుతున్నారు. సౌతాఫ్రికా టూర్ త‌ర్వాత కోహ్లీతో పాటు సీనియ‌ర్ల‌కు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి నిచ్చింది. విరాట్ యాడ్స్‌ల‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ధావ‌న్‌కు కోహ్లీ ట్విట్ట‌ర్‌లో ఛాలెంజ్ విసిరారు. ధావ‌న్‌కు ఛాలెంజ్ విస‌ర‌డ‌మేంటి అని ఆలోచిస్తున్నారా..? మీరు విన్న‌ది నిజ‌మే.

అయితే ఆఛాలెంజ్ క్రికెట్‌కు సంబంధించి కాదులేండి. అది డ్యాన్స్ విష‌యంలో. కోహ్లీ ఓ ప్రముఖ బ్యాగుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అయితే ఆ కంపెనీ తన మార్కెటింగ్‌కు సంబంధించి ఓ ఛాలెంజ్‌ను విసిరింది. ఆ సంస్థ బ్యాగ్ తగిలించుకొని… డిఫరెంట్‌గా స్టెప్పులెయాలట. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన విరాట్ కూడా… అదిరిపోయే స్టెప్పులేశాడు. దాన్ని రికార్డు చేసి… తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వీడియోను పోస్ట్ చేయడమే కాదు… ధావన్‌కు కూడా ఛాలెంజ్ కూడా విసిరాడు.

నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా… నువ్వు దీనికంటే బాగా చేయగలవా… నీ స్టెప్పులు చూపించూ అంటూ ట్వీట్ చేశాడు. కోహ్లీ స్టెప్పులకు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీలంక ట్రై సిరీస్‌లో ఉన్న ధావన్ విరాట్ ఛాలెంజ్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి. విరాట్ ఛాలెంజ్‌పై సోషియ‌ల్ మీడియాలో ఫన్నీ ట్వీట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -