Thursday, May 16, 2024
- Advertisement -

విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్..పాక్ ఓపెన‌ర్ ప్ర‌శంస‌

- Advertisement -

ఇంగ్లండుతో టీమిండియా మొద‌టి రెండు టెస్టుల్లో ఓడినా మూడో టెస్టులో పుంజుకుంది. బ్యాట్స‌మేన్, బౌల‌ర్లు స‌మిష్టిగా రానించ‌డంతో మూడో టెస్ట్‌లో ఘ‌ణ విజ‌యం సాధించింది కోహ్లీ సేన‌. మూడో టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లో 97, 103 పరుగులు చేసి భారత్ విజయంలో కీల‌క పాత్ర పోషించారు.

విరాట్ కోహ్లి బ్యాటింగ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు పాక్ ఓపెన‌ర్ ఫకార్ జమాన్. కోహ్లీనీ చూస్తూ తాను చాలా నేర్చుకున్నానని ఈ పాక్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కష్టపడటం ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనడానికి అతనే ఉదాహరణ. అందరిలానే కోహ్లి బ్యాటింగ్‌ను నేను కూడా ఆస్వాదిస్తాను.. అతని ఆటని చూడటం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. కోహ్లీ ఓ బ్యాటింగ్‌ మాస్టర్’ అని కితాబిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -