Tuesday, May 21, 2024
- Advertisement -

కెప్టెన్ ధోనీ, కోచ్ గంగూలీ.. గొడవలు తప్పవా..?!

- Advertisement -

టీమిండియాకు కెప్టెన్లుగా రెండు భిన్నమైన రీతిల్లో తమ మార్కును చూపిన వారు వారిద్దరూ.

ఒకరు జట్టుకు దూకుడు నేర్పి.. విజయాలను అలవాటు చేయగా, మరొకరు కూల్ గా ఉంటూనే దూకుడైన విజయాలను సాధించారు. క్లిష్టపరిస్థితుల్లో జట్టు కెప్టెన్సీని చేతబట్టి పరిస్థితులను చక్కదిద్ది విజయాలబాట పట్టించిన కెప్టెన్ గంగూలీ అయితే.. సీనియర్లతో కూడిన జట్టును కూడా నడిపించి.. జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ ధోనీ.
మరి ఇలా ఎవరికి వారు ప్రత్యేకమైన వారైన ఇద్దరు కలిసి పనిచేయనున్నారట! టీమిండియాకు గంగూలీ కోచ్ గా రానున్నాడట. ధోనీ ఆధ్వర్యంలోని జట్టుకు శిక్షకుడిగా మారనున్నాడట. మరి ఇదే జరిగితే గంగూలీ అభిమానులకు ఆనందమే. అయితే గంగూలీ, ధోనీలు ఒకే ఒరలో కుదరుకొంటారా? అనేదే అనుమానం.
ఇద్దరిలో ఎవరి ఇగో వారికి ఉంటుంది.. ఇప్పటికే ధోనీ.. సెహ్వాగ్ , గంభీర్, యువరాజ్ వంటి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పింపజేశాడనే విమర్శలు ఉన్నాయి. దీని ద్వారా ధోనీ అంటే ఏమిటో అర్థం అవుతోంది. ఇక గంగూలీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి వారిద్దరూ కలిసి పనిచేస్తే.. జట్టుకు విజయాలు దక్కితే పర్వాలేదు. అనవసర వివాదాలు మొదలైతే మాత్రం మొదటికే మోసం వస్తుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -