Friday, May 17, 2024
- Advertisement -

అది కేసీఆర్ వీక్ పాయింట్ అయ్యిందా..?!

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వీక్ పాయింట్ గా మారాయా?

ఈ ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం భయపడుతోందా? ఇప్పటికే జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయడానికి సాకులు చెప్పి  తప్పించుకొంటోందా? అనే సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. స్వయంగా ఈ విషయంలో హై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యానాలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి!

జీహెచ్ఎంసీ ఎన్నికల అంశం ఇప్పటికే కోర్టు వరకూ వెళ్లింది. ఈఎన్నికల నిర్వహణ వాయిదా పడుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి కొంతమంది పిటిషన్లు వేశారు. వీటికి సమాధానాలు చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది.
జీహెచ్ ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన జరగాల్సి ఉందని.. దీనికి కొంత సమయం పడుతుందని.. కాబట్టి తమకు మరింకొంచెం సమయం కావాలని మున్సిపల్ శాఖ అధికారులు కోర్టుకు విన్నవించుకొన్నారు. అయితే ఈ సమాధానం పట్ల కోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇలా సాకులు చెప్పి ఎన్నికలను వాయిదా వేయడం ఏమిటి? అని ప్రశ్నించింది.
ఎన్నికలు మీరు నిర్వహిస్తారా.. మమ్మల్ని నిర్వహించమంటారా? అని కూడా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మరి అన్నీ ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం తమ రాజధానిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించలేకపోతోంది! దీనికి నిజంగానే పునర్విభజన రీజన్లే కారణమా..లేక ఓటమి భయమా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -