Sunday, May 5, 2024
- Advertisement -

బాబుకు ఏపీ పై ఉన్న ప్రేమ ఇదేనా.?!

- Advertisement -

ఒకవైపు ప్రపంచమంతా తిరిగి వచ్చి.. ఆయా దేశాల్లోని వ్యాపారవేత్తలను, ప్రభుత్వాలను తమ నూతన రాజధానిలో పెట్టుబడులు పెట్టండి..

అక్కడే మీకు కాలనీలు ఏర్పాటు చేస్తాం.. స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొండి.. మా పిల్లలకు మీ దేశాల భాషలు నేర్పుతాం.. చూడండి.. అంటూ హామీలు ఇచ్చి వస్తున్నాడు. వేల ఎకరాల భూమి ఉంది రారండోయ్ అంటున్నాడు!

 

ఇక ఏపీ ప్రభుత్వంలో భాగమయ్యే ఉద్యోగుల విషయంలోనైతే బాబు చాలానే చెబుతున్నాడు. ఉద్యోగులు అంతా ఏపీ తాత్కాలిక రాజధానికి వెళ్లాలని ఆ మధ్య మంత్రులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు అక్కడికి వెళ్లాల్సిందేనని కూడా స్పష్టం చేశారు. అయితే తాత్కాలిక, నూతన రాజధానుల్లోకి వెళ్లడానికి తమకున్న అభ్యంతరాలను ఉద్యోగులు నిస్సందేహం గా వ్యక్తం చేశారు. తమకు కనీస సదుపాయాలు లేని చోటికి ఎలా వెళతాం? అని వారు ప్రశ్నించారు. అయితే మంత్రులు మాత్రం వెళ్లాల్సిందేనని అంటున్నారు!

మరి ఇలా అందరికీ శకునం చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి తాము మాత్రం హైదరాబాద్ లోనే తిష్టవేస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన ఇళ్లు రిపేరీ పెట్టుకొన్న తెలుగుదేశం అధినేత.. కొత్త ఇంటిని హైదరాబాద్ లో కట్టిస్తున్నాడు, అద్దె ఇంటినీ హైదరాబాద్ లోనే వెదుక్కొన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సందేహం ఏమిటంటే.. బాబు ఏపీ నూతన రాజధానిలోనో.. తాత్కాలిక రాజధానిలోనో… లేకపోతే కనీసం విజయవాడలోనో కొత్తింటిని ఎందుకు కట్టుకోవడం లేదు?! అనేది.

ఉద్యోగులను ఏమో ఏపీకి వెళ్లిపోవాలని అంటారు.. బాబు మాత్రం హైదరాబాద్ లోని సౌకర్యాలను, సదుపాయాలను వదులుకోలేడు. ఇక్కడే అద్దె ఇంటిని.. ఇక్కడే కొత్తింటిని కట్టించుకొంటాడు. మరి ఊరందరినీ అక్కడికి వెళ్లే బాబు మాత్రం అక్కడికి వెళ్లడనమాట! ఆయన మాత్రం ఇక్కడే ఉంటాడంతే. ఒక ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం కరెక్టేనా?! ఆయనే ముందుకు వెళ్లి సీమాంధ్రలో సెటిలయితే అందరిలోనూ ఒక చలనం రాదా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -