Monday, April 29, 2024
- Advertisement -

క‌శ్మీర్ విష‌యంలో అఫ్రీది ట్వీట్‌కి ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చిన గంభీర్‌….

- Advertisement -

పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది కాశ్మీర్ విష‌యంలో భార‌త్‌కు వ్య‌తిరేకంగా చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. భారత్‌పై విషం చిమ్ముతూ… కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. భారత్ ఆక్రమించిన కాశ్మీర్‌లో ఏదో కల్లోలం జరుగుతుందంటూ మొసలి కన్నీరు కార్చాడు. భారత్ ఆక్రమించిన కాశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటూ ట్విటి్ చేశారు.

కశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్ తనదైన శైలిలో ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని ఈ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ సెటైర్‌ వేశాడు.

అఫ్రిది ట్వీట్‌పై స్పందించాలని మీడియా ప్రతినిధులు నాకు ఫోన్‌ చేస్తున్నారు. బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి ఆనందపడుతున్నాడు.’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -