Tuesday, April 30, 2024
- Advertisement -

భూవీ పట్టిన క్యాచ్ అదుర్స్…..

- Advertisement -

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో విండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.. టీమిండియా విజయంలో భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కాగా, భువీ పట్టిన రిటర్న్‌ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

భారత్ ఘనవిజయంలో భూవీ కీలక పాత్ర పోషించారు. విండీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని ఆడిన వెస్టిండీస్ ప్లేయర్ ఛేజ్ బంతిని లెగ్ సైడ్ ఆడబోయాడు. అనూహ్యంగా బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో బంతిని భువనేశ్వర్ కుమార్ ఒడిసి పట్టాడు. ఈ క్రమంలో భువీ ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. కాగా ఈ క్యాచ్ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.

ఫాస్ట్‌ బౌలర్లు రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడం అంత సులభం కాదు. ఫాస్ట్ బౌలర్ బంతిని వేసిన తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ చాక చక్యంగా క్యాచ్‌ను పట్టుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -