Sunday, May 19, 2024
- Advertisement -

స్టార్ క్రికెట‌ర్ అక్ర‌మ సంబంధాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన భార్య‌..

- Advertisement -

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ అక్రమ సంబంధం వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇది ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. ష‌మీ బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది వేరెవ‌రో కాదు భార్య‌నే. వేరే మహిళలతో షమీ చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను అతడి భార్య హసీన్ జహన్ బయటపెట్టింది. మహిళలతో షమీ సాగించిన చాటింగ్ వివరాలను ఫోన్ నంబర్లతో సహా స్క్రీన్ షాట్లు తీసిన జాహన్ వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది.

షమీకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2014లో ఓ ఫోన్‌ను బహుకరించింది. కార్లో లభ్యమైన ఆ ఫోన్లో షమీ వేరే మహిళలతో చాటింగ్ చేసిన వివరాలు ఉండటాన్ని జాహన్ గుర్తించింది. షమీ, అతడి కుటుంబ సభ్యులు జాహాన్‌ను రెండేళ్లుగా హింసిస్తున్నారు. తనను హతమార్చేందుకు కూడా ప్రయత్నించార’ని సదరు ఛానెల్ తెలిపింది. షమీపై, అతడి కుటుంబ సభ్యులపై న్యాయపోరాటానికి ఆమె సిద్ధం అవుతోందని సమాచారం.

జనవరిలో షమీ భార్య ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా-ఎ తరఫున దేవ్‌ధర్ ట్రోఫీలో ఆడుతున్న షమీ ధర్మశాలలో ఉన్నాడు. దీనిపై ష‌మీ స్పందిస్తే గాని ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -