Saturday, May 18, 2024
- Advertisement -

ఓటుకు కోట్లు కేసుతో బాబును దెబ్బ కొట్టిన జగన్…… మూడో అభ్యర్థి లేడు

- Advertisement -

సంతలో పశువుల్లా మా ఎమ్మెల్యేలను కొన్నారు. అనైతికం, అరాచకం అంటూ ఫ్లాష్ బ్యాక్‌లో ఓ సారి కెసీఆర్‌పై విరుచుకుపడిన చంద్రబాబు…..ఆ తర్వాత ఆ నీతిమాలిన పనులన్నింటినీ తాను కూడా చేశాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఐఎఎస్‌ల సమక్షంలో మీటింగులు పెట్టి లంచాల పంపకం ఎవరి మధ్య ఎలా ఉండాలో అవినీతి పాఠాలు చెప్పాడు. అలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ ఒన్ రాష్ట్రంగా ఉందంటే ఆశ్ఛర్యం ఏముంది? ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు కొనుగోళ్ళ వ్యవహారాలకు చెక్ పెట్టడంలో మొదట్లో ఫెయిల్ అయ్యాడు జగన్. అధికార బలం, ఆర్థిక బలం పుష్కళంగా ఉన్న చంద్రబాబు తెగించి ఎమ్మెల్యేలను కొంటూ ఉంటే అడ్డుకోలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం జగన్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.

వైకాపా నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జంప్ అయినా కూడా వైకాపా రాజ్యసభ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు అన్నది నిజం. మూడో అభ్యర్థిని గెల్చుకోవడం కంటే కూడా ఎంతటి అనైతిక రాజకీయాలు చేసి అయినా వైకాపా రాజ్యసభ అభ్యర్థి గెలవకుండా చేయాలన్నది చంద్రబాబు స్కెచ్. అందుకే వైకాపా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలకు మంత్రులనే పురమాయించాడు.

అయితే ఈ సారి మాత్రం బాబు కొనుగోళ్ళ వ్యవహారం గురించి పూర్తిగా అవగాహనకు వచ్చిన వైకాపా ముందుగానే అలర్ట్ అయింది. వైకాపా ఎమ్మెల్యేలందరికీ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించి చంద్రబాబు, లోకేష్‌ల నుంచి మంత్రుల వరకూ వైకాపా ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేస్తూ……. నడిపిన అనైతిక కొనుగోలు వ్యవహారాలను రికార్డ్ చేయించింది. ఇప్పుడు ఇలాంటి సాక్ష్యాలు విజయసాయిరెడ్డి దగ్గర చాలా ఉన్నాయని తెలుస్తోంది. స్వయంగా విజయసాయిరెడ్డి కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. బాబు ఏ మాత్రం తోక ఆడించినా రేవంత్ రెడ్డి ఓటుకు కోట్లు ఇష్యూతో సహా ఇప్పటి కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాలు కూడా రాష్ట్రపతి సమక్షంలో చర్చకు పెడతామని చంద్రబాబు అండ్ కోని హెచ్చరించాడు విజయసాయి. ఇప్పుడు ఈ హెచ్చరికలే బాబు క్యాంప్‌లో గుబులు రేపుతున్నాయని తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసు దెబ్బకే మోడీ దగ్గర, కెసీఆర్‌ల దగ్గర బానిసగా ఉండక తప్పని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు ఇంకా ఇరుక్కున్నామంటే మొత్తానికే మోసం వస్తుందని ……ఒక్క రాజ్యసభ సీటు కోసం మొత్తం రాజకీయ భవిష్యత్తుని ఫణంగా పెట్టడం అవసరమా అని బాబు క్యాంపులో ముఖ్యులు ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు ఓటుకు కోట్లు వ్యవహారంతో ముడిపడి ఉన్న సిఎం రమేష్‌కి ఈ సారి రాజ్యసభ సీటు ఇవ్వడంలేదు చంద్రబాబు. అందుకే ఛాన్స్ దొరికితే చంద్రబాబును అడ్డంగా ఇరికించడానికి సిఎం రమేష్ వర్గీయులు కూడా రెడీగా ఉన్నారన్న భయం టిడిపి ముఖ్య నేతల్లో ఆందోళన పెంచుతోంది. మొత్తానికి వైకాపా వ్యూహాలు అయితే సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బాబు అనైతిక కొనుగోలు వ్యవహారాలకు బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ స్థాయి సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా స్పష్టం చేస్తూ ఉండడంతో వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మునిగిపోయే పడవలాంటి టిడిపిలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అలా బాబుగారి అనైతిక కొనుగోలు వ్యవహారాలకు ఈ సారికి మాత్రం అడ్డుకట్ట పడినట్టే కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -