Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ స‌చివాల‌య‌మా….లీకేజీ స‌చివాల‌యమా…?

- Advertisement -

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం మరింత ఎక్కువ కావడంతో.. ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో అమరావతిలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉండటంతో రాష్ట్ర సచివాలయానికి వరదముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం ఉండటంతో ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

భారీ వ‌ర్షాల‌కు స‌చివాల‌యంలో మ‌ళ్లీ లీకులు మొద‌ల‌య్యాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి.

మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్‌ల్లో సీలింగ్‌ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్‌ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్‌లోనూ పలు చోట్ల సీలింగ్‌ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్‌ సెక్షన్‌లోకి వర్షలు నీరు వచ్చి చేరుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -