Sunday, April 28, 2024
- Advertisement -

ర‌బాడ‌ క‌వ్వింపుకు బ్యాట్‌తో దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ….

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స‌ఫారీల‌తో జ‌రిగిన రెండు వ‌న్డేల్లో అబ్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొవ‌టి వ‌న్డేలో సెంచ‌రీ చేసిన కోహ్లీ రెండో వ‌న్డేలో కూడా బ్యాటింగ్‌లో రానించారు. సెంచూరియ‌న్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో కవ్వించి సిక్సర్‌ కొట్టించుకున్నాడు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ.

సెంచూరియన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రబాడ వరుస షార్ట్ పిచ్‌ బంతులతో విరాట్ కోహ్లిని పరీక్షించాడు. ఆ ఓవర్‌లోని ఐదో బంతి‌ని హిట్ చేసేందుకు విరాట్ కోహ్లి ప్రయత్నించగా.. అది బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి కోహ్లి శరీరానికి బలంగా తాకింది. దీంతో కాసేపు నొప్పితో కోహ్లి క్రీజులో విలవిలలాడిపోయాడు. క‌ళ్లు చెదిరే సిక్స్‌ను కొట్టిన వీడియోను చూడండి.

ఈ సమయంలో బంతి అందుకునేందుకు కోహ్లి సమీపంలోకి వచ్చిన రబాడ కవ్వించాడు. అప్పటికే ఆ ఓవర్‌లోని వరుసగా ఐదు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక పరుగు కూడా చేయలేకపోవడాన్ని అక్కడ రబాడ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతే ఇంకేముంది కోపంతో రగిలిపోయిన కోహ్లి.. ఆ ఓవర్‌లోని చివరి బంతిని రబాడ షార్ట్‌ పిచ్‌‌గా విసిరినా.. లెక్క చేయకుండా ఫైన్‌ లెగ్‌ దిశగా సిక్స్ రూపంలో స్టాండ్స్‌లోకి తరలించేశాడు. ఇలాంటి బంతినే రోహిత్ శర్మ హిట్ చేయబోయి అంతకముందే ఔటవడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 118 పరుగులకి ఆలౌటవగా.. భారత్ 20.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -