డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిని చవిచూసింది.ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మేన్ డీవిల్లర్స్ దూరం కాగా ఇప్పుడు సాఫారీలకు మరో దెబ్బ తగిలింది. మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ చేతి వేలికి గాయం అయింది. తొలి వన్డేలో అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ డుప్లెసిస్ చేతి వేలి గాయంతో పూర్తి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో కెప్టెన్‌గా మర్‌క్రమ్ ను ఎంపిక చేసింది టీమ్‌మేనేజ్‌మెంట్.
తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్‌కు కుడి చేతి చూపుడు వేలు విరిగిందని, మూడు నుంచి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గాయపడటంతో కెప్టెన్ ఎవరా అనే సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో అనూహ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌ను ప్రకటించింది. డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్ బెహర్డీన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. వన్డే సిరీస్ మొత్తానికి మర్ క్రామ్ నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ దక్షిణాఫ్రికా కన్వీనర్ లిండాజొండి తెలిపారు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్‌లోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది.