రికార్డ్ @150.. అతడే నెంబర్ ఒన్ !

- Advertisement -

అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ ఉన్న క్రీడలలో క్రికెట్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా దేశం ఏదైనా తమకు నచ్చిన ఆటగాడిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు అంతర్జాతీయ క్రికెట్ అభిమానులు. వారి అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో బౌండరీల మోత మోగిస్తూ ఉంటే అభిమానుల ఆనందనికి హద్దులు ఉండవు. అలాంటిది అత్యంత తక్కువ బాల్స్ లోనే సెంచరీలు చేస్తూ రికార్డ్స్ సృష్టిస్తుంటే అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే. అలా తక్కువ బాల్స్ లోనే కేవలం సెంచరీ మాత్రమే కాదు. 150 వ్యక్తిగత స్కోర్ చేసి ప్రపంచ క్రికెట్ రికార్డ్స్ లో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం..!

1.ఏబీ డివిలియర్స్
అంతర్జాతీయ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ తెలియని వారు ఉండరు. బౌలర్ ఎవరైనా, బాల్ ఎలాంటిదైనా, తనదైన షాట్స్ తో అన్నీ వైపులా బౌండరీల మోత మోగించే ఏబీ .. మిస్టర్ 360 గా పేరు తెచ్చుకున్నాడు. అతని పేరు మీద ఎన్నో చెక్కు చెదరని రికార్డ్స్ ఉన్నాయి. వన్డే క్రికెట్ లో అత్యంత తక్కువ బాల్స్ లోనే 150 సాధించిన ఆటగాడిగా ఏబీ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 2015 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 64 బంతుల్లోనే 150 పరుగులు చేసి ఔరా.. అనిపించాడు. దాదాపు 245.45 స్టైక్ రేట్ తో ఫస్టెస్ట్ 150 సాధించిన ఆటగాడిగా ఏబీ అగ్రస్థానంలో ఉన్నాడు.

- Advertisement -

2.బట్లర్
తాజాగా ఇంగ్లాండ్ – నెదర్లాండ్ మద్య జరిగిన మ్యాచ్ లో బట్లర్ 65 బంతుల్లో 150 సాధించి డివిలియర్స్ తరువాత ఫస్టెస్ట్ 150 సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్ లో బట్లర్ మొత్తం మీద 70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సుల సాయంతో 162 పరుగులు చేశాడు. అయితే బట్లర్ గతంలో 2019 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 77 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇక తాజాగా నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకున్నాడు.

3.షేన్ వాట్సన్
వాట్సన్ కూడా తక్కువ బాల్స్ లో 150 చేసిన ప్లేయర్స్ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. 2011 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే 150 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు.

ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ షర్జిల్ ఖాన్, అయిదు, ఆరు స్థానాల్లో కొనసాగుతుంటే, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియా వెనక్కి తగ్గదు..!

పంత్ తీరు మారేనా ..?

భువిని ఊరిస్తున్న రికార్డ్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -