Sunday, May 19, 2024
- Advertisement -

రోహిత్ సెంచ‌రీచేయాలంటే, కోహ్లీ ర‌నౌట్ కావాల్సిందేనా…? రోహిత్‌పై నెటిజ‌న్ల సెటైర్లు

- Advertisement -

ద‌క్షిణాఫ్రికా గడ్డ మీద వరుస మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మపై అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు ఘాటుగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హిట్ మ్యాన్‌గా పేరున్న రోహిత్ స‌ఫారీ టూర్‌లో విఫ‌ల‌మ‌య్యారు. అయితే ఐదో వన్డేలో సెంచరీతో త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు చెక్‌పెట్టాడు రోహిత్‌. కానీ ఆ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ క్రీజులో ఉండగానే.. మరో ఎండ్‌లో కోహ్లి, రహానే రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో చాలా కాలం తర్వాత సెంచరీ చేసినప్పటికీ.. రోహిత్ సంబరాలు చేసుకోలేదు. పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు సందర్భంగా.. సెంచరీలతో సత్తా చాటిన ఈ ముంబై ప్లేయర్ రితికకు వాలెంటైన్స్ గిఫ్ట్ ఇచ్చాడు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జోడి క్రీజులో ఉన్నప్పుడు కోహ్లి ఐదుసార్లు రనౌట్ కాగా, రోహిత్ రెండుసార్లు రనౌట్ అయ్యాడు. కోహ్లి రనౌట్ అయిన ప్రతిసారీ హిట్ మ్యాన్ బాధ్యాయుతంగా ఆడి భారీ స్కోర్లు సాధించాడు. కోహ్లి రనౌట్ అయిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో సెంచరీ సాధించిన రోహిత్ ఓ హాఫ్ సెంచరీ చేశాడు.

రోహిత్ మూడు డబుల్ సెంచరీలు చేస్తే.. అందులో రెండు డబుల్ సెంచరీలు కోహ్లి రనౌట్ అయిన మ్యాచ్‌ల్లో చేసినవే. దీంతో హిట్ మ్యాన్ సెంచరీ చేయాలంటే.. కోహ్లి రనౌట్ కావాలి లేదంటే.. వాళ్లావిడకు గిఫ్ట్ ఇచ్చేలా ఏదైనా ప్రత్యేక సందర్భం రావాలని అభిమానులు సోషియ‌ల్‌మీడియాలో పంచ్‌లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -