భారత్‌తో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా సెలక్టర్లు జట్టుని గురువారం ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఆరు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. 15 మందితో కూడిన జట్టుని తొలి మూడు వన్డేల కోసం ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్.. వన్డే సిరీస్‌లోనూ జట్టుని నడిపిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లా, డేవిడ్ మిల్లర్, డికాక్, జేపీ డుమిని తదితర క్రికెటర్లతో టాప్ ఆర్డర్‌ను బలిష్టం చేసిన సెలక్టర్లు.. యువ క్రికెటర్లు షంషీ, జొండోకి అవకాశం కల్పించి ఆశ్చర్యపరిచారు.
బౌలింగ్‌లో విభాగంలో టెస్టులో మెరుగ్గా రాణిస్తున్న మోర్నీ మోర్కెల్, రబాడ, ఆండిల్‌తో పాటు ఆల్ రౌండర్ క్రిస్‌మోరీస్‌కి జట్టులో ఛాన్స్ దక్కింది. స్పిన్నర్లుగా తాహిర్, షంషీ జట్టులోకి రాగా.. యువ ఫాస్ట్ బౌలర్ ఎంగిడిపై కూడా సెలక్టర్లు నమ్మకం ఉంచారు. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ‍్రవరి 1వ తేదీ నుంచి ఆరు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌లోనూ డు ప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స‍్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డుప్లెసిస్, హసీమ్ ఆమ్లా, డికాక్, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరీస్, ఎంగిడి, ఆండిల్, రబాడ, షంషీ, జొండో.