Wednesday, May 15, 2024
- Advertisement -

రికార్డుల బాద్‌షా షా పై ప్ర‌ముఖుల ప్ర‌శంశ‌లు…

- Advertisement -

అరంగేట్రం టెస్టులోనే మెరుపు శతకం బాదిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా ఈరోజు ఆరంభమైన మొదటి టెస్టులో స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన పృథ్వీ షా (134: 154 బంతుల్లో 19×4) సెంచరీ‌తో దశాబ్దాల రికార్డుల్ని కనుమరుగు చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు.

మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌తోపాటు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌లాంటి వాళ్లు అతన్ని ఆకాశానికెత్తారు. ఈ ఇన్నింగ్స్‌తో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాని ఓ రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. ఇండియా తరఫున తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా షా నిలిచిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -