Sunday, May 12, 2024
- Advertisement -

మొద‌టిరోజు భార‌త్‌దే పైచేయి..భారీ స్కోరుదిశ‌గా టీమిండియా

- Advertisement -

రాజ్‌కోట్ లో వెస్టీండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్‌లో టీమిండియా మొద‌టి రోజే భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. అంత‌గా అనుభ‌వం లేని విండీస్ బౌల‌ర్ల‌ను భార‌త బ్యాట్స్‌మేన్‌లు చుక్క‌లు చూపిస్తున్నారు.తొలి టెస్ట్ తొలి రోజే పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది.

ఆరంగ్రేటం కుర్రాడు పృథ్వీషా అద్భుత సెంచరీతో చెలరేగగా, ఛతేశ్వర్ పూజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్‌కి బాటలు వేశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది టీమిండియా. క్రీజులో ఇంకా సారథి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు.

ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ లోకేశ్ రాహుల్ డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. ఆ తర్వాత పృథ్వీషా, పూజారా కలిసి రెండో వికెట్‌కి 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పృథ్వీషా ధాటిగా ఆడుతూ, షాట్లు కొట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. పూజారా మాత్రం తనదైన ఆటతీరుతో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 130 బంతుల్లో 14 ఫోర్లతో 86 పరుగులు చేసిన తర్వాత పూజారా అవుటైయ్యాడు. ఆ తర్వాత తొలిటెస్ట్‌లోనే రికార్డ్ సెంచరీ నమోదు చేసిన పృథ్వీషా… దేవేంద్ర బిషో బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -