Tuesday, April 30, 2024
- Advertisement -

సొంత జిల్లాలో భారీ మార్పుల దిశ‌గా జ‌గ‌న్ క‌స‌ర‌త్తు..

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలు తమ తమ అభ్యర్థుల ఖరారు దశకు వచ్చేసినట్టుగా కనిపిస్తున్నాయి.అధికారంలోకి రావాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఆపార్టీకీ బూస్ట్ ఇవ్వ‌డంలే సందేహంలేదు. ఇక ప్రాచారంలోనే జ‌గ‌న్ అభ్య‌ర్తుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అన్ని పార్టీల‌కంటే ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి సంచ‌ల‌నాల‌కు తెర‌లేపారు.

సొంత జిల్లాలో జ‌గ‌న్‌కు చెక్ పెట్టేందుకు బాబు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బ‌ల‌మైన అభ్య‌ర్త‌ల‌ను రంగంలోకి దింపేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.ఇక వైసీపీ, టీడీపీ పార్టీల అభ్య‌ర్తుల క‌రారు తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి.

వైసీపీ త‌రుపున కడ‌ప ఎంపీ బ‌రిలోఎవ‌రు నిల‌బ‌డ‌తారనే వార్త‌లు సంచ‌ల‌నం రేపాయి. వైఎస్ ఫ్యామిలీనుంచే అభ్య‌ర్తుల మ‌ధ్య పోటీ ఉంద‌న్న విష‌యం తెలిసిందే. వాట‌న్నింటి అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అందులో భాగంగా కడప ఎంపీగా తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకూ కడప ఎంపీగా వైఎస్ కుటుంబానికే చెందిన అవినాష్ రెడ్డి కడపకు ఎంపీగా ఉన్నారు.

అయితే అవినాష్ రెడ్డి బాగా సౌమ్యుడు అని, చొచ్చుకుపోయే స్వభావం తక్కువని. .అందుకే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివేకానందరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో మార్పు చేర్పుల్లో ఉంది. ఇందులో భాగంగా సొంత జిల్లాలో కూడా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్యే నియోజ‌క వ‌ర్గాల్లోనూ మార్పులు, చేర్పులు భారీగా చోటు చేసుకోనున్నాయి. అయితే పార్టీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. మున్ముందు జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -