వెస్టిండీస్ పై జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచులో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డేల్లోో అతనికి ఇది 21వ సెంచరీ. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో ఇది రెండోది. అతనికి అంబటి రాయుడు నిలకడగా ఆడుతూ మంచి తోడ్పాటు అందిస్తూ అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
ఇక్కడ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్‌గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. 107 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ ఓపెనర్‌గా 19వ సెంచరీ నమోదు చేశాడు.
అంతకముందు సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 19 సెంచరీలు పూర్తి చేసుకోగా, రోహిత్ మాత‍్రం సచిన్ కంటే 8 ఇన‍్నింగ్స్‌లు ముందే ఈ ఘనత నమోదు చేశాడు. ఇక‍్కడ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరగా, ఆ తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు.
