Friday, May 3, 2024
- Advertisement -

రాహుల్ రవీంద్రన్ కంట్రోల్ లో లేని మన్మధుడు

- Advertisement -

యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ చి లా సౌ అనే సినిమా తో దర్శకుడి గా తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టాడు. ఆ సినిమా విజయం సాధించడం తో వెంటనే రాహుల్ నాగార్జున కన్తో పడ్డాడు. అందుకే నాగార్జున ఎంతగానో నచ్చి కొనుక్కున్న ఒక ఫ్రెంచ్ సినిమా హక్కుల ని రాహుల్ కి ఇచ్చి ఆ సినిమా ని తెలుగు లో రీమేక్ చేయమన్నాడు. అలా మొదలైంది మన్మధుడు 2. నిజానికి రాహుల్ టేస్ట్, నాగార్జున టేస్ట్ అసలు మ్యాచ్ కాదు. కానీ నాగార్జున రాహుల్ ని తనకి కావాల్సిన విధం గా మౌల్డ్ చేసుకొని, తనకి నచ్చిన విధం గా స్క్రిప్ట్ చేయించుకొని సినిమా చేసాడు.

నాగార్జున ఎప్పుడూ దర్శకత్వం లో వేలు పెట్టడు కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం తన కి కావలసినట్టు పని చేయించుకుంటాడు. ఇంతకు ముందు కూడా ఈ విషయం పై పరోక్షం గా నాగార్జున స్పందించారు. ఇప్పుడు మన్మధుడు 2 కూడా రాహుల్ కంట్రోల్ లో కన్నా నాగార్జున కంట్రోల్ లో నే ఎక్కువ ఉంది అనే టాక్ నడుస్తుంది. నాగార్జున దగ్గర ఉండి సినిమా ని కట్ చేయించుకున్నారట. అనవసరమైన సీన్లు అన్నీ ఏరవేసి ఫ్లో దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు అని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -