మూడు టీ 20 మ్యాచ్ సిరీస్ దక్షిణాఫిక్రాతో భారత్ సిద్ధమైంది. దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టును ఎంపిక కమిటీ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు ఎంపికను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జరిగింది.ఈ మేరకు జట్టును ప్రకటించారు. ఫిబ్రవర్ 1 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ ఆరు వన్డేల సిరీస్ కూడా ఉంది. దీనికోసం భారత జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. వీటి దర్వాత ట్వంటీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఇటీవల మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికాతో 2-1 తేడాతో జరిగింది. మూడో టెస్టులో అన్నింట్లో ప్రతిభ కనబర్చి 63 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి కొంచెం పరువు నిలుపుకుంది. వన్డే సిరీస్ ముందు ఈ విజయం టీమిండియాకు ఉత్సాహాన్నిచ్చింది.
టీ ట్వంటీ సిరీస్ జట్టు ఇదే
భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్‌శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ధోని, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దుల్ థాకూర్.
- Advertisement -
దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -