Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీడేర్ డేవిల్స్‌కు బిగ్ షాక్‌…ఐపీఎల్‌నుంచి ర‌బ‌డా ఔట్‌

- Advertisement -

ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యారు. గాయం కారణంగా మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్‌లో ఆడటం లేదు.

వరల్డ్ నంబర్ 1 టెస్ట్ బౌలర్ కగిసో రబాడ గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఢిల్లీడేర్ డేవిల్స్ కు బిగ్ షాక్ అని చెప్ప‌వ‌చ్చు. రబాడ లోయర్ బ్యాక్ స్ట్రెస్ రియాక్షన్‌తో బాధపడుతున్నాడని క్రికెట్ సౌతాఫ్రికా గురువారం తెలిపింది. అతడు మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని సౌతాఫ్రికా టీమ్ మేనేజర్ మహ్మద్ మూసాజీ తెలిపారు.

నెల రోజుల పాటు రబాడ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జూలైలో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటన నాటికి అతడు ఫిట్‌గా ఉండాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టులు సిరీస్‌లో రబాడ 23 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -