Friday, May 17, 2024
- Advertisement -

రాహుల్ బ్యాటింగ్‌కు ప్లాట్ అయిన పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంక‌ర్‌…

- Advertisement -

భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. క్లాసికల్ ప్లేయర్‌గా ముద్రపడిన ఈ యువ బ్యాట్స్‌మన్.. భారీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో 471 పరుగులు చేసిన రాహుల్.. ఇప్పటివరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఒకానొక టైంలో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మను బదులు రాహుల్‌ తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ డిమాండ్‌ కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే పాకిస్థాన్‌ యాంకర్‌ ఒకరు రాహుల్‌ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.

రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు.

మ్యాచ్ అనంతరం జైనబ్ అబ్బాస్ ట్వీట్ చేస్తూ.. ‘కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. సూపర్బ్ టైమింగ్. చూడటానికి చాలా గొప్పగా ఉంది’ అంటూ పేర్కొంది. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ పాకిస్థాన్ మహిళా యాంకర్ ఐపీఎల్‌లో ఆడుతున్న ఓ భారత ఆటగాడిని పొగడటం పట్ల టీమిండియా ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -