Tuesday, May 21, 2024
- Advertisement -

స్మిత్ స్థానాన్ని భ‌ర్తీ చేసిన స‌ఫారీ ఆట‌గాడు క్లాసెన్‌…

- Advertisement -

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురై ఐపీఎల్‌కి దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ భర్తీ చేసుకుంది. దక్షిణాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను స్మిత్‌స్థానంలో తీసుకుంది. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అసాధారణ హిట్టింగ్‌తో వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్లాసెన్‌ను తీసుకుంటున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.

జనవరి 27, 28న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన క్లాసెన్‌ని కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. కానీ.. భారత్‌‌పై అతను చెలరేగిన తీరుని చూసిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్ మరో ఆలోచన లేకుండా క్లాసెన్‌‌‌కి ఓటేసింది.

క్లాసెన్ చేరికతో రాజస్థాన్‌ రాయల్స్‌ హిట్టర్ల జాబితా పెరిగింది. ఇప్పటికే రూ. 12.5 కోట్లకి ఇంగ్లాండ్ హిట్టర్ బెన్‌స్టోక్స్‌ని కొనుగోలు చేసిన రాజస్థాన్ జట్టులో బట్లర్, త్రిపాఠి, సంజు శాంసన్ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -