Thursday, May 9, 2024
- Advertisement -

టీ20 చరిత్రలో అత్యంత చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న ఆస్టన్‌ టర్నర్‌..

- Advertisement -

టీ20 చ‌రిత్ర‌లోనె అత్యం చెత్త రికార్డు నెల‌కొల్పాడు ఆస్టన్‌ టర్నర్‌. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని నెలల క్రితం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు. టీ20ల్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌. బిగ్‌బాష్‌ లీగ్‌లో టర్నర్‌ ప్రదర్శన చూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం కూడా అతగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పుడు పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదే సమయంలో ఈ బ్యాట్స్‌మన్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు.

రాజస్థాన్‌ తరఫున ఆడిన మూడు మ్యాచుల్లోనూ వరుసగా డకౌట్‌ అయ్యాడు. అంతకుముందు బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా సున్నాకే వెనుదిరిగాడు. ఇలా వరుసగా డకౌట్‌ అవుతూ కనీసం బౌలర్లకు కూడా అందని రికార్డు సొంతం చేసుకున్నాడీ ఆస్ట్రేలియన్‌ హార్డ్‌ హిట్టర్‌.టీ20 చరిత్రలోనే వరుసగా ఐదుసార్లు డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -