Thursday, April 25, 2024
- Advertisement -

ఐపీఎల్ 2019 : రాజ‌స్థాన్‌పై హైద‌రాబాద్ అద్భుత విజ‌యం….

- Advertisement -

ఐపీఎల్‌లో హైద‌రాబాద్ బోణీ కొట్టింది. ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాస్థాన్ రాయ‌ల్స్ పై హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (69: 37 బంతుల్లో 9×4, 2×6) మెరుపు అర్ధశతకం బాదడంతో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది. రాయల్స్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. వార్నర్(37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు), బెయిర్‌స్టో(28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.గోపాల్(3/27) కు మూడు వికెట్లు దక్కాయి.

అంతకముందు సంజు శాంసన్ (102 నాటౌట్: 55 బంతుల్లో 10×4, 4×6) అజేయ శతకం బాదడంతో 2 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 198 పరుగులు చేసింది. రహానే(49 బంతుల్లో 70, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించాడు. రషీద్‌ఖాన్(1/24), నదీమ్ (1/36) ఒక్కో వికెట్ తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -