చిరంజీవి సినిమా సెట్‌లో సిలిండ‌ర్ పేలి ఇద్ద‌రు మృతి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి స్వాంత‌త్య్ర స‌మ‌ర‌యోధుడుగా న‌టిస్తున్న సినిమా సైరా. ఊయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ ప్ర‌మాదం చోటు చేసుకుంది. షూటింగ్‌లో సిలిండ‌ర్ పేల‌డంతో ఇద్ద‌రు మ‌రంచిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మృతులను చిన్నారి అయిషా ఖాన్(5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు.సినిమా షూటింగ్‌లో అనుహ్యాంగా గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన తెలుస్తోంది. త‌ల్లి కూతుర్లు ఇద్ద‌రు సినిమా షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చార‌ని స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో మ‌రికొంద‌రికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్ర‌మాదం చిరంజీవి సైరా మూవీలో జ‌రిగింది కాద‌ని ఆస‌ల్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా ‘ర‌ణం’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌. కాని మీడియా వాళ్లు మాత్రం మ‌న మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు వార్త‌లు రాసేశారు. చివ‌రి అస‌లు విష‌యం తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. హీరో చిరంజీవి కూడా మృతుల కుటుంబాల‌కు ఆర్ధిక సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

https://www.youtube.com/watch?v=yzg30lSG95w
- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -