Friday, May 10, 2024
- Advertisement -

ఐపీఎల్ పై వేల కోట్ల బెట్టింగ్స్

- Advertisement -
IPL Betting

IPL-10 ద్వారా పందెంరాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. దాంతో వీరికి చేతినిండా పనిదొరికింది. ఈ ఐపీఎల్ సీజన్ లో దేశవ్యాప్తంగా 2వేల కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ లు జరగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డిమానటైజేషన్ ఎఫెక్ట్ తో నగదు కంటే స్థిరాస్తులతో బెట్టింగ్ లు జరుగుతాయని సమాచారం.

ఒక్క హైదరాబాద్ లోనే రూ. 100 కోట్ల బెట్టింగ్ జరుగబోతోందని సమాచారం. ఈ దఫా బెట్టింగ్ లో స్మార్ట్ ఫోన్ యాప్ లో కీలకంగా మారనున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్ మెసేంజర్ వంటి సోషల్ మీడియా యాప్ లతో పాటు బెట్ ఫెయిర్, బెట్ 365 స్పెషల్ గా బెట్టింగ్ కోసమే వచ్చాయి.

ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బెట్టింగ్ లు జోరుగా సాగుతాయని అనుమానిస్తన్నారు. హైదరాబాద్ లో పేకాటరాయుళ్లపై పోలీసుల దాడులు ఎక్కువగా జరుగుతుండడంతో IPL క్రికెట్ బెట్టింగ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పేకాట క్లబ్బులు మూతపడడంతో క్రికెట్ బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. IPL సందడి మొదలైన సందర్భంగా బుకీలపై నిఘా పెంచారు పోలీసు స్పెషల్ ఆపరేషన టీం.

{youtube}xXS66YzF01Y{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -