Wednesday, May 22, 2024
- Advertisement -

నాలాగా అంద‌రూ ఆడాల‌నుకోవ‌డం స‌రికాదంటూ కోహ్లీకీ స‌ల‌హా ఇచ్చిన ఆసిస్ దిగ్గ‌జ‌ కెప్టెన్ స్టీవా

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా పలు సూచనలు చేశాడు. దక్షిణాఫ్రికాలో కోహ్లీ ఆట చూశానని చెప్పిన స్టీవ్..కోహ్లీలో ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ దూకుడుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ జట్టులోని ఆటగాళ్లంతా తనలాగే ఆడాలని కోరుకోవ‌డం త‌ప్ప‌న్నారు. జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్ల‌లో ఒక్కో ఆట‌గాడు ఒక్కోలా ఆడ‌తార‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించాల‌ని హిత‌వు ప‌లికారు.

కోహ్లీలో దూకుడు కెరీర్ లో నేర్చుకున్నదానిలో భాగమేనని ఆయన పేర్కొన్నాడు. సారథిగా కోహ్లీ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నడని, జట్టును నడిపే సత్తా కోహ్లీలో ఉందని అన్నాడు. జ‌ట్టులో రహానె, పుజారా ప్రశాంతంగా ఆడతారని, రోహిత్ కుదురుకున్నాక దూకుడుగా ఆడుతాడని, ఇలా ఒక్కోఆటగాడు ఒక్కోలా జట్టుకోసం ఆడుతున్నారన్న విషయాన్ని గ్రహిస్తే మరింత మెరుగవుతాడని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.

మైదానంలో దిగిన తరువాత సానుకూలంగా ఆడాలని, ప్రత్యర్థిని వీలైనంత త్వరగా మట్టికరిపించాలని కోహ్లీ భావిస్తాడని స్టీవ్ వా తెలిపాడు. ఆసీస్ ను ఆస్ట్రేలియాలో ఎదుర్కోవడం కఠినమని, ఆసీస్ తో టోర్నీలో సవాళ్లకు టీమిండియా సిద్ధపడాలని స్టీవ్ వా హెచ్చరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -