బాల్ ట్యాంపరింగ్ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచానికి మాయని మచ్చలా మారింది.స్మిత్,వార్నర్ ఇద్దరు సంవత్సరంపాటు క్రికెట్‌కు దూరం అయ్యారు.ఇప్పడు తాజాగా వార్నర్ భార్య క్యాండిస్ సంచలన వాఖ్యలు చేసింది.బాల్ ట్యాంపరింగ్ ఘటన తనవల్లే జరిగిందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భార్య క్యాండిస్ వార్నర్ తెలిపారు.ఈ ఘటనకంతా తానే కారణమని, ఇది తనని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్నర్ భార్య క్యాండిస్, న్యూజిలాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లు ఉన్నాయి.దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సోని బిల్ మాస్కులు ధరించి రావడం వార్నర్ మానసిక స్థితి మరింత దెబ్బతీసిందని వార్నర్ భార్య క్యాండిస్ చెప్పుకొచ్చింది.
