Wednesday, May 8, 2024
- Advertisement -

టీడీపీకి కేశినేని నాని రాజీనామా!

- Advertisement -

విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన నాని..తన అవసరం పార్టీకి లేనప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అన్నారు. అందుకే ఎంపీ పదవితో ఆపాటు పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తానని చెప్పారు.

చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన నాని..వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని నాని రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. అంతేగాదు ఢిల్లీకి వెళ్లేందుకు చాలా విమానాలుంటాయని పరోక్షంగా టీడీపీ కాకుండా వేరే పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా నిలిచే ఛాన్స్ కూడా లేకపోలేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు.

ఇక నానికి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా బరిలో దిగే అవకాశాలుండటంతో నాని బీజేపిలో చేరే ఛాన్స్ తక్కువే. మరోవైపు వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది.విజయవాడలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని నిర్ణయాలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -