Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ సేఫ్ ప్లేస్ నుండి సోనియా పోటీ!

- Advertisement -

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుండి పోటీ చేయనున్నారా? పోటీ చేస్తే ఏ స్థానం నుండి పోటీ చేయనున్నారు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇక ఇదే జోష్‌తో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచి సత్తాచాటాలని భావిస్తున్నారు హస్తం నేతలు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు వేసిన ఎత్తుగడ సోనియా గాంధీని బరిలోకి దింపడం. ఇందుకు సంబంధించి తీర్మానాలు కూడా చేశారు. ఇక సోనియా పోటీ చేస్తారనగానే గుర్తుకొచ్చే స్థానం మెదక్. గతంలో ఇదే స్థానం నుండి ఇందిరా గాంధీ విజయం సాధించారు. అయితే సోనియా మాత్రం సేఫెస్ట్ ప్లేస్ ఖమ్మంను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్, మల్కాజిగిరి స్థానాలు పరిశీలించినా ఫైనల్‌గా ఖమ్మం ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట. అందుకే సోనియా గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 10 స్థానాల్లో 9 సీట్లలో గెలుపొందింది కాంగ్రెస్. పొంగులేటి జిల్లా వ్యాప్తంగా సత్తాచాటారు. అందుకే ఆయనతో పాటు షర్మిలకు బాధ్యతను అప్పజెప్పడం ద్వారా మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది. సోనియాగాంధీ ఒకవేళ తెలంగాణ నుంచి పోటీ చేస్తే సౌత్ నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుండి పోటీచేసి సుష్మా స్వరాజ్‌ని ఓడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -