Wednesday, May 15, 2024
- Advertisement -

మలింగా బౌలింగ్ స్పీడ్ తెలుసు.. కానీ స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టాడు.. వీడియో వైరల్..

- Advertisement -

క్రికెట్ లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే ముఖ్యం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా బౌలింగ్ వేసేవారిలో లాసిత్ మలింగా ఒకరు. శ్రీలంకకు చెందిన ఈ ఆటగాడి బౌలింగ్ వేస్తే.. కొన్నిసార్కు టాప్ ప్లేయర్స్ కూడా వణికిపోతారు. మలింగ బౌలింగ్ కి వికెట్లు కూడా కొన్నిసార్లు విరిగిపోతాయి.

140 నుంచి 150 స్పీడ్ తో బంతులను వీసిరే ఈ బౌలర్ స్టైల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పాలి. తన బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అయితే ఈ రేంజ్ ఫాస్ట్ బౌలింగ్ చేసేవారు చాలా తక్కువ. అయితే మలింగా ఫాస్ట్ బౌలింగ్ మాత్రమే చేస్తారని అందరికి తెలుసు కానీ ఆయన ఓ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. మలింగా స్పిన్ బౌలింగ్ వేయడం ఏమిటని ఎవ్వరు నమ్మడం లేదు. కానీ రీసెంట్ గా శ్రీలంక లో జరిగిన దేశవాళీ టోర్నమెంట్‌లో మలింగా వేసిన స్పిన్ బౌలింగ్ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది.

లంక జట్టు తరపున ఆడిన 34 ఏళ్ల మలింగ అనూహ్యంగా ఆఫ్-స్పిన్ బౌలింగ్ వేసి మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మలింగా ఇలా స్పిన్ వేయడానికి ఒక కారణం ఉంది. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో త్వరగా మ్యాచ్ ను ముగించాలని మలింగా తన బౌలింగ్ శైలిని మార్చుకొని ఆఫ్-స్పిన్ బౌలింగ్ వేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -