Saturday, May 11, 2024
- Advertisement -

ల‌క్ష్మ‌ణ్ ప‌రుగుల వెన‌క ర‌హ‌స్యం గురించి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ట్వీట్‌

- Advertisement -

భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ రోజు 43వ పుట్టిన రోజుసంద‌ర్భంగా ఆయనకు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లక్ష్మణ్‌ ప్రస్తుతం భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వాట‌న్నింటిలోకెల్లా ల‌క్ష్మ‌ణ్‌కి విషెస్ చెబుతూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పెట్టిన ట్వీట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ల‌క్ష్మ‌ణ్‌కి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం ర‌హ‌స్యాన్ని స‌చిన్ బ‌య‌ట‌పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే లక్ష్! మైదానంలో నువ్వు పరుగులు సాధించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో బయటికి చెప్పేయనా?. బ్యాటింగ్‌కు వెళ్లేముందు నువ్వు స్నానం చేసి యాపిల్‌ తింటావు. వూప్స్` అని స‌చిన్ ట్వీట్ చేశాడు. ఇది సోషియ‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా త‌న‌దైన శైలిలో ట్వీట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపాడు. అప్ప‌ట్లో లక్ష్మణ్‌ను ముద్దుగా మణికట్టు మాంత్రికుడు అని పిలిచేవాళ్లు. అందుకే సెహ్వాగ్, లక్ష్మణ్‌ చేతులను ‘రాయ్‌’ సినిమాలోని ‘చిటియాన్‌ కలైయాన్‌’ పాటతో పోల్చాడు. ‘రిస్ట్‌ జాదుగర్‌, భారత శ్రీ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన మణికట్టు మాయతో అనుగుణంగా మార్చేస్తాడు. చిటియాన్‌ కలైయాన్‌’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -