Saturday, April 20, 2024
- Advertisement -

టికెట్ లేకుండా విమానం ఎక్కిన ఏడేళ్ల బాలిక‌ ….

- Advertisement -

సాధార‌న రైల్వే స్టేష‌న్‌ల‌లోనె భ‌ద్ర‌త క‌ట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటిది విమానాశ్ర‌యాల్లో అయితె సెక్యూరిటి చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటిది ఏడేళ్ల బాలిక ఏకంగా  టికెట్‌లేకుండా విమానాశ్ర‌యంలోకి ప్ర‌వేశించి ఓ విమానం ఏంచ‌క్కా ఎక్కేసింది. జెనీవాలో జరిగిన ఈ ఘటన పోలీసులతోపాటు అక్క‌డున్న సెక్యూరిటీ సైతం అవాక్క‌య్యారు.ఎలా అనుంకుంటున్నారా…?

ఆదివారం నాడు జెనీవా కేంద్ర రైల్వే స్టేషన్ దగ్గర పొరపాటున తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి విమానాశ్రయానికి వెళుతున్న బస్సును ఎక్కేసింది. ఈలోగా తమ పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి సీసీటీవీలను పరిశీలించారు. ఆ పాప ఎక్కిన వాహనం ఎయిర్ పోర్టుకు వెళ్లిందని తెలుసుకుని అక్కడికి సమాచారం ఇచ్చారు.

అయితె అప్ప‌టికె విమానాశ్రయం మెయిన్ సెక్యూరిటీ గేటును దాటుకుని లోనికి వెళ్లిన పాప, తన చుట్టూ ఉన్న పెద్దవాళ్ల మధ్య నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ ను కూడా దాటేసి, నడుచుకుంటూ ముందుకెళ్లి డిపార్చర్ కు సిద్ధంగా ఉన్న ఓ విమానాన్ని ఎక్కేసింది. విమానం ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది ఆ పాప ఎవరో ప్రయాణికులకు సంబంధించిన పాపేనని అనుకున్నారు. అంతకుముందు ఓ విమానం బోర్డింగ్ గేటు వద్దకు వచ్చి అటూ ఇటూ చూసి, తన తల్లిదండ్రులను ఆమె వెతుక్కున్నట్టు సీసీటీవీల్లో కనిపించింది. రెండోసారి మాత్రం ఓ విమానాన్ని పాప ఎక్కేయగా, ఓ అధికారికి అనుమానం వచ్చి, ఆరా తీసి ఆమెను పోలీసులకు అప్పగించాడు.

ఏవిమానం ఎక్కింది అక్క‌డి అధికారులు వెల్ల‌డించ‌లేదు. ఫ్రాన్స్, స్విస్ సరిహద్దుల్లో ఉన్న జెనీవా ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులు రెండు దేశాల మధ్యా అత్యధిక సంఖ్యలో తిరుగుతూ ఉంటారు. ఇక ఈ ఘటన దురదృష్టకరమని, మరోసారి జరుగకుండా చూసుకుంటామని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. అయితె సెక్యూరిటి వైఫ‌ల్యంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -