Tuesday, May 21, 2024
- Advertisement -

స్నేహితుల‌కోసం వంటవాడి అవ‌తారం ఎత్తిన స‌చిన్‌…

- Advertisement -

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ వంటవాడిగా మారాడు. తాజాగా సచిన్‌ తన ట్విటర్‌ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. స్నేహితుల కోసం తాను ఈ అవతారమెత్తినట్లు సచిన్‌ పేర్కొన్నాడు.

క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న స‌మ‌యాన్ని కుటుంబంతో, స్నేహితుల‌తో గ‌డ‌పడానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలు, వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల న్యూఇయ‌ర్ వేడుక‌లను కూడా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో స‌చిన్ జ‌రుపుకున్నారు.

అయితే ఈ సంద‌ర్భంగా వారి కోసం స్వ‌యంగా వంట‌కాలు చేసి పెట్టాడు స‌చిన్‌. తాను వంట చేస్తున్న వీడియోను స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నిప్పుల మీద చికెన్ వేస్తూ, అప్పుడు వ‌స్తున్న పొగ‌కు ఇబ్బంది ప‌డుతూ సచిన్ వంట చేస్తుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు.

స‌చిన్ చేసిన వంట‌లు బాగా కుదిరింద‌ని, స్నేహితులు చాలా ఇష్టంగా తిన్నార‌ని స‌చిన్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అంతకుముందు సచిన్‌, యువరాజ్‌ సింగ్‌, అజిత్‌ అగార్కర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో సచిన్‌ ధరించిన టోపీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. స‌చిన్ వంట‌చేస్తున్న వీడియో చూడండి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -