Monday, May 20, 2024
- Advertisement -

భ‌ర్త వివాహేత‌ర సంబంధంపై మ‌రో బాంబు పేల్చిన ష‌మీ భార్య‌….

- Advertisement -

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు. చాలా మంది యువతులతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని అంతకుముందు జహాన్‌ ఆరోపించారు. తన భార్య చేసిన ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు.

ఇప్పుడు తాజాగా ష‌మీ భార్య మ‌రో బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -