Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీదేవి డాక్కుమెంట‌రీకి డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా…?

- Advertisement -

నటిగా దశాబ్దాల అనుభవం, అనేక సంవత్సరాల పాటు, వివిధ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన చరిత్ర కలిగిన శ్రీదేవి అర్దాంతరంగా ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లిపోయారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణించారు. ఆ మరణం విషయం ఇప్పటికీ మిస్టరీగా ఆమె అభిమానుల్లో ఉంది.

తెర‌పైకి శ్రీదేవి బ‌యోపిక్ అని వ‌చ్చిన వార్త‌ల‌ను బోణీక‌పూర్ ఖండించారు. అయితే శ్రీదేవి పై డాక్యుమెంటరీని ఆమె భర్త బోనీ తెరకెక్కించనున్నట్టు సమాచారం. శ్రీదేవి, అనిల్ కపూర్‌లతో మిస్టర్ ఇండియా మూవీని తెరకెక్కించిన శేఖర్ కపూర్‌ని ఈ డాక్యుమెంటరీలో భాగం చేయనున్నారట. శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో శ్రీదేవి 200లకు పైగా సినిమాల్లో నటించారు. శ్రీదేవి హఠాన్మరణంతో.. సినీ లోకం మూగబోయింది. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ను1996లో శ్రీదేవి వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. జాహ్నవి, ఖుషి.

1963, ఆగస్టు 13న శివకాశిలో శ్రీదేవి జ‌న్మించారు. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్‌గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే మామ్ చిత్రంతో నటించి అందరిని అలరించారు.

తెలుగులో అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి లక్షల సంఖ్యల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చాందిని, లమ్హే, మిస్టర్ ఇండియా, నాగిన వంటి బ్లాక్‌బ్లాస్టర్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -