Wednesday, May 15, 2024
- Advertisement -

త‌న అభిమాన బ్యాటింగ్ హీరోకి శుభాకాంక్ష‌లు తెలిపిన స‌చిన్

- Advertisement -

స‌చిన్ ఏంటి బ్యాటింగ్ హీరో ఏంటి ఆలోచిస్తున్నారా…? మీరు విన్నది కరెక్టే .టెండూల్కర్ కు ఓ బ్యాటింగ్ హీరో ఉన్నాడట. ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా..? ఆయ‌నే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వీవి రిచర్డ్స్. బుధవారం 66వ పుట్టినరోజు జరుపుకొంటున్న వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ తెందూల్కర్‌ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ సందర్భంగా సచిన్ స్పెషల్ విషెస్ చెప్పాడు. రిచర్డ్స్తో కలిసి దిగిన ఫోటోతో… నా బ్యాటింగ్ హీరో రిచర్డ్స్కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశాడు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి… తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సచిన్ ట్వీట్కు ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఇద్దరూ ఇద్దరేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రిచర్డ్స్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శం. ఆయన గ్రౌండ్లోకి దిగారంటే తన విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోతారు. బౌండరీల మోత మోగిస్తారు. సచిన్ కూడా ఈ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాన్ని తన హీరోగా చెబుతుంటారు. అందుకే ప్రత్యేకంగా బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు.

రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అసలు హెల్మెట్‌ ధరించడట. చిన్నతనంలో క్రికెట్‌ ఆడుతున్నప్పుడు దేశ చిహ్నం ఉన్న టోపీని తలపై పెట్టుకోవడం గొప్ప అవకాశంగా భావించేవాడట. ఆ టోపీ ధరించడం దేశానికి గర్వకారణంగా పేర్కొన్నాడు. తీరా అవకాశం వచ్చాక బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆ టోపీకి ఎక్కడ న్యాయం చేయలేకపోతానో అనే ఆందోళనతో ఎప్పుడూ టోపీ ధరించడానికి ఇష్టపడేవాడు కాదట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -