Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం: హసీన్ జహాన్

- Advertisement -

అక్ర‌మ సంబంధాలు ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ష‌మీ గ‌తంలో ఒక సారి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించార‌న్న సంగ‌తి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ష‌మీ భార్య హసీన్ జహాన్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

షమీకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనని హింసిస్తున్నాడని హసీన్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా షమీ కొంత మంది అమ్మాయిలతో దిగిన ఫోటోలు, ఛాటింగ్ వివరాలను స్క్రీన్ షాట్ తీసి మరి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. కాగా ఆమె ఆరోపణలను నమ్మిన బీసీసీఐ షమీ కాంట్రాక్టును కూడా రద్దు చేసింది.

మేమిద్దరం 2012లో తొలిసారి కలుసుకున్నాం. అంతకుముందు షమి తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ఐదు సంవత్సరాల పాటు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షమి ఆత్మహత్యకు యత్నించాడు’ అని తెలిపింది హసీన్‌.

అయితే ష‌మీ కోసం నా మోడలింగ్‌ కెరీర్, ఉద్యోగం వదులుకున్నాన‌ని చెప్పింది.దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆస్తులు, బీమాకు సంబంధించిన పత్రాలను తీసుకున్నాడు. గత రెండేళ్ల నుంచి విడాకులు ఇవ్వాలని కోరుతూనే ఉన్నాడు .

విడాకులు కావాల‌ని అడుగుతున్నాడ‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ విడాకులు తీసుకోన‌ని రెండు రోజుల క్రితం చెప్పంది హసీన్. షమీపై నేను చేస్తున్న ఆరోపణలన్నింటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే అతన్ని కోర్టుకు లాగుతా’ అని హసీన్‌ వివరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -